రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోగుల వెంబడి వచ్చే వ్యక్తులకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. ఎస్పీ రాహుల్ హెగ్డే, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ మురళీధర్ రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.
సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో ప్రభుత్వాస్పత్రి వద్ద అన్నదానం - food distribution by satyasai seva samithi
లాక్డౌన్ నేపథ్యంలో నిరుపేదలను ఆదుకునేందుకు పలువురు సహృదయులు, స్వచ్ఛంద సంస్థలు తోచినంత సాయం చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. నిత్యావసరాల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు చేస్తూ అండగా ఉంటున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చే వారికి సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదానం
సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఎస్పీ అన్నారు. లాక్డౌన్ పూర్తయ్యేవరకు అన్నదానం కొనసాగుతుందని తెలిపారు. ఈ రోజు 120 మందికి ఆహార పొట్లాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ చీకోటి అనిల్, పౌరసంక్షేమ సమితి అధ్యక్షుడు బియ్యంకార్ శ్రీనివాస్, సామాజిక సేవా కార్యకర్త వేణు, సేవాదళ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి:అనాథల ఆకలి తీరుస్తున్న పోలీసులు