రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలోకి మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కలిసి చేపపిల్లలను వదిలారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో ఉచితంగా చేపపిల్లల పంపిణీ జరుగుతున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్... వ్యవసాయం, కులవృత్తులకు చేయూతనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
మానేరులోకి చేపపిల్లలు.. వదిలిన మంత్రులు తలసాని, గంగుల
మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్ కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మధ్యమానేరు జలాశయంలోకి చేప పిల్లలను విడుదల చేశారు. ఇప్పుడు 5 లక్షల చేపపిల్లలను వదిలామని.. మొత్తం 30 లక్షల పిల్లలను విడుదల చేయనున్నట్లు మంత్రి తలసాని వెల్లడించారు.
మధ్యమానేరులోకి చేపపిల్లలను వదిలిన మంత్రులు తలసాని, గంగుల
చేపపిల్లల క్వాలిటీ, కౌంటింగ్ విషయంలో రాజీపడమంటూ మంత్రి తలసాని తెలిపారు. చేపలు విడుదల చేసే సమయంలో వీడియోగ్రఫీ, లెక్కింపు చేపడుతున్నామని చెప్పారు. మధ్యమానేరులో ఇవాళ 5 లక్షల చేపపిల్లలు విడుదల చేశామని.. మొత్తం 30 లక్షల పిల్లలను వదలనున్నట్లు తలసాని స్పష్టం చేశారు.