తెలంగాణ

telangana

ETV Bharat / state

మద్యం మత్తులో వేలు కొరికేసిన తాగుబోతు - రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తలు

మద్యం మత్తులో ఓ వ్యక్తి చేతివేలిని ఓ తాగుబోతు కొరికిపారేసిన ఘటన రాజన్న సిరిసిల్ల వేములవాడలో చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు.

drunken person biting finger in rajanna siricilla district
మద్యం మత్తులో వేలు కొరికేసిన తాగుబోతు

By

Published : May 28, 2020, 10:41 PM IST

ఇరువురు పీకలదాకా మద్యం సేవించారు... అప్పటిదాకా బాగానే ఉన్నా ఆ ఇరువురికి అంతలోనే మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారు ఒకరినొకరు దూషించుకుంటూ గొడవకు దిగారు. మద్యం మత్తులో ఒకరినొకరు తోసుకున్నారు. ఇరువురిలో ఒక తాగుబోతు పట్టలేని కోపంతో మరొక తాగుబోతు కుడిచేతి చూపుడు వేలును బలంగా కొరికి సగ భాగం కిందపారేశాడు.
ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రాజన్న ఆలయం వెనుక భాగంలోని అంబేడ్కర్​ చౌరస్తా వద్ద చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని బాధితుడిని చికిత్స నిమిత్తం పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ABOUT THE AUTHOR

...view details