తెలంగాణ

telangana

ETV Bharat / state

కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు.. అభినందించిన మంత్రులు

COVID-19 positive pregnant: కరోనా సోకిన గర్భిణీకి వైద్యులు ప్రసవం చేసిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకుంది. తల్లీబిడ్డ సురక్షితంగా ఉన్నట్లు, చికిత్స గురించి డీఎంహెచ్​వో ట్విటర్​లో ఉంచగా.. చికిత్స అందించిన వైద్యులను మంత్రులు హరీశ్​రావు, కేటీఆర్​ ప్రశంసించారు. తల్లీ బిడ్డ క్షేమమన్న వార్త చాలా సంతోషం కలిగించిందని తెలిపారు.

కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు.. అభినందించిన మంత్రులు
కరోనా సోకిన గర్భిణీకి ప్రసవం చేసిన వైద్యులు.. అభినందించిన మంత్రులు

By

Published : Jan 27, 2022, 2:01 AM IST

COVID-19 positive pregnant: కరోనా సోకిన గర్భిణికి పురుడు పోసిన ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులను మంత్రులు హరీశ్‌ రావు, కేటీఆర్​ అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి అత్యవసర పరిస్థితుల్లో ఓ గర్భిణి వచ్చింది. ఆమెకు కరోనా ఉందని తెలుకున్న వైద్యులు.. జాగ్రత్తలు పాటించి కాన్పు చేశారు. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని వెంటనే సిరిసిల్ల జిల్లా ఆస్పత్రికి తరలించారు.

ఈ విషయాన్ని సిరిసిల్ల జిల్లా వైద్యాధికారి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇది గమనించిన వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు... ఇలాంటి మంచి వార్తలు చాలా వినాలని ఆకాంక్షించారు. తల్లీ బిడ్డ క్షేమమన్న వార్త చాలా సంతోషం కలిగించిందని తెలిపారు. కేటీఆర్​ సైతం మంచి పనిచేశారంటూ... వైద్యులను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details