రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ పరిశీలించారు. మూడపెల్లి, నర్సింగాపూర్ గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల్లో పంట సేకరణ, ఇంకా కొనాల్సిన ధాన్యం వివరాలపై ఆరా తీశారు. వర్షాకాలం వస్తున్నందున సాధ్యమైనంత త్వరగా కోనుగోళ్లు పూర్తి చేసి మిల్లులకు తరలించాలని అధికారులకు సూచించారు.
'ధాన్యం కొనుగోలు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి' - ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ కృష్ణ భాస్కర్
వర్షాకాలం సమీపిస్తున్నందున ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు కలెక్టర్ కృష్ణ భాస్కర్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలుగ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు.
సిరిసిల్ల వార్తలు
అవసరమైన గన్నీ బ్యాగులు, వాహనాలు సమకూర్చుకోవాలని తెలిపారు. రవాణాలో జాప్యం కలగకుండా వివిధ ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని వేగంగా తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద కచ్చితంగా టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ నరేశ్, పౌర సరఫరాల శాఖ ఉప తహసీల్దార్ ప్రవీణ్, వహీదుద్దీన్, తదితరులు ఉన్నారు.
ఇదీ చూడండి:Minister Harish Rao: వరికి బదులు పత్తి, కంది సాగు చేయండి: హరీశ్‌రావు