రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని వెల్జీపూర్లో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. కాలనీలను చుట్టుముట్టి ప్రతి ఇల్లును తనిఖీ చేశారు. కుటుంబ సభ్యుల వివరాలు, వాహన ధ్రువీకరణ పత్రాలను పరిశీలించారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
'శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు'
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వెల్జీపూర్లో జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 14 ద్విచక్రవాహనాలు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు.
గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకే నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నామని ఎస్పీ పేర్కొన్నారు. కాలనీలోకి వచ్చిన అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఆర్ సీ, పొల్యూసన్ తదితర పత్రాలు కలిగి ఉండటం వల్ల ప్రమాదాలు జరిగిన సమయంలో లబ్ధి చేకూరుతుందని తెలిపారు.
ఎలాంటి సమస్య వచ్చిన డయల్ 100 సేవలు ఉపయోగించుకోవాలని సూచించారు. తనిఖీల్లో సిరిసిల్ల పట్టణ డీఎస్పీ చంద్రశేఖర్, రూరల్ సీఐ సర్వర్, ఎస్సైలు ప్రవీణ్ కుమార్, లక్ష్మారెడ్డి, పలువురు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కల్యాణలక్ష్మికి.. అందని 'లక్ష్మీ' కటాక్షం..?