తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక సోమవారం సందర్భంగా వేకువజాము నుంచే భక్తులుధర్మగుండంలో స్నానాలు ఆచరించి... కోడె మొక్కులు చెల్లించుకుని స్వామి దర్శనానికి క్యూ కట్టారు. భక్తుల రద్దీతో స్వామివారి దర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. దర్శనానంతరం ప్రాంగణంలో మహిళలు దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేములవాడలో భక్తుల రద్దీ
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో కార్తిక సోమవారం వేడుకలను పురస్కరించుకుని భక్తులు ఆలయానికి పోటెత్తారు.
వేములవాడలో భక్తుల రద్దీ