అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా పని చేయాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా మారకూడదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మండిపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్కు విధించిన శిక్షను బట్టి రాష్ట్రంలో ఏ విధమైన పాలన కొనసాగుతుందో అర్థమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ శిక్ష కేవలం కలెక్టర్కు విధించినట్లు కాదని... సీఎం కేసీఆర్కు విధించినట్లు భావించవచ్చని ఆయన ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
ఆ జైలు శిక్ష కలెక్టర్కు కాదు సీఎం కేసీఆర్కు...: జీవన్ రెడ్డి - తెలంగాణ వార్తలు
ఇద్దరు కలెక్టర్లకు హైకోర్టు శిక్ష విధించడాన్ని చూస్తే రాష్ట్రంలో పాలన ఎంత బాగా సాగుతుందో అర్థమవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. అధికారులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి పని చేయాలే తప్ప అధికార పార్టీకి తొత్తులుగా పని చేయకూడదని విమర్శించారు. సిరిసిల్ల కలెక్టర్కు విధించిన జైలు శిక్ష సీఎం కేసీఆర్కు విధించినట్లు భావించవచ్చని ఆయన విమర్శించారు.
అనంతగిరి ప్రాజెక్ట్ భూ నిర్వాసితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పించాల్సి ఉన్నప్పటికీ వారికి న్యాయం చేయకుండా సమీక్షల పేరిట కాలయాపన చేస్తున్నారని ఆయన విమర్శించారు. మంథనిలో న్యాయవాదుల హత్యకు సంబంధించి కేవలం మండల అధ్యక్షుడిని తెరాస నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. హత్యలతో సంబంధం ఉన్న పార్టీ ప్రజా ప్రతినిధులను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడి చట్టాలను, కోర్టులను గౌరవించాలని సూచించారు.
ఇదీ చదవండి:మూడు నెలల్లో లక్షా 91 వేల ఉద్యోగాలకు కృషి చేస్తాం: చిన్నారెడ్డి