కాంగ్రెస్ అధిష్ఠానం పిలుపుమేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో జేఈఈ, నీట్ పరీక్షలు నిర్వహిస్తున్న భాజపా ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నామన్నారు. విద్యార్థుల ప్రాణాలతో కేంద్రంలోని భాజపా ప్రభుత్వం చెలగాటమాడుతోందని మండిపడ్డారు.
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిరసన - జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిరసన
జేఈఈ, నీట్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ ఎదుట జిల్లా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. కరోనా నేపథ్యం కేంద్రంలోని భాజపా ప్రభుత్వం విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని విమర్శించారు.
జేఈఈ, నీట్ పరీక్షలను వాయిదా వేయాలని కాంగ్రెస్ నిరసన
రాష్ట్ర ఎన్ఎస్యూాఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ గాంధీభవన్ వద్ద చేస్తున్న ఆమరణ దీక్షకు మద్దతు తెలుపుతూ... జేఈఈ, నీట్ పరీక్షలను వెంటనే వాయిదా వేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ గౌడ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆకునూరి బాలరాజు, బ్లాక్ ప్రెసిడెంట్ సూర దేవరాజు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ చొప్పదండి ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.