తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్రజావ్యతిరేక జీవో 131 ను వెంటనే రద్దు చేయాలి' - protest in siricilla

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రజా వ్యతిరేక జీవో 131 ఎల్ఆర్ఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్​ చేశారు.

bjp leaders protest against lrs act in siricilla
bjp leaders protest against lrs act in siricilla

By

Published : Sep 29, 2020, 1:33 PM IST

ఎల్​ఆర్​ఎస్​ పేరుతో ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని భాజపా సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి గోపి ఆరోపించారు. ఎల్ఆర్ఎస్​ను రద్దు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం ముందు భాజపా నాయకులు ధర్నా చేశారు.

ఇప్పటికైనా ఎల్ఆర్ఎస్​ను రద్దు చేసి... 131 జీవోను వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల పట్టణ భాజపా అధ్యక్షుడు వేణు, భాజపా నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: వచ్చే నెల 3 నుంచి అందుబాటులోకి ధరణి సేవలు

ABOUT THE AUTHOR

...view details