రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో గందరగోళం నెలకొంది. కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తా వద్దకు వెళ్లి ఆయన చిత్రపటానికి భాజపా నేతలు నివాళులర్పిస్తుండగా... పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎందుకు ఆపుతున్నారని నిలదీయడంతో తోపులాట జరిగింది. భాజపా జిల్లా అధ్యక్షుడు పోలీసుల మీద ఆగ్రహం వ్యక్తం చేయగా... పోలీసులు వెనుదిరిగారు. అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి భాజపా నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెరాస పాలనలో తెలంగాణ వీరులకు కనీసం నివాళులర్పించే లేని పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు తలపెట్టినా... ప్రజా సమస్యలపై పోరాడడానికి తామెప్పుడూ ముందుంటామని భాజపా పట్టణ అధ్యక్షులు వాసు పేర్కొన్నారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో గందరగోళం
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో భాజపా కార్యకర్తలు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు నిర్వహించారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల్లో గందరగోళం