తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎన్నికల పండగ తెచ్చింది సిరిసిల్లలో ఉపాధి మెండుగా..! - PRODUCING

ఏదైనా ఊర్లో... ఎన్నికలొచ్చాయంటే ఫ్లెక్సీలు, బ్యానర్లతో వాడలన్నీ రంగులమయం అవుతాయి. కానీ... దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో ఎన్నికల పండగొచ్చినా...  సిరిసిల్ల కార్మిక వాడల్లో మాత్రం సందడి నెలకొంటుంది. పార్టీల జెండాలు, ప్రచార సామగ్రి తయారీతో రెండు మూడు నెలలు అధిక ఉపాధి పొందుతున్నారు స్థానిక మహిళలు.

సిరిసిల్ల కార్మిక వాడల్లో సందడి

By

Published : Mar 22, 2019, 12:02 AM IST

సిరిసిల్ల కార్మిక వాడల్లో సందడి
ఎన్నికల సందర్భంగా దేశంలోని రాజకీయ పార్టీల ప్రచార సామగ్రి ఆర్డర్లు సిరిసిల్లలోని వస్త్ర పరిశ్రమలను ముంచెత్తుతున్నాయి. రాష్ట్రంలో మరమగ్గాల వస్త్ర ఉత్పత్తిలో సిరిసిల్లది మొదటి స్థానం. 30 వేల కుటుంబాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తున్నారు.

రోజుకు 50 నుంచి 60 వేల మీటర్లు...
ఒక్కోచోట ప్రత్యక్షంగా పరోక్షంగా 200 మంది మహిళలు ఉపాధి పొందుతున్నారు. వీరికి రోజుకు రూ.250 వరకు సంపాదిస్తారని చెబుతున్నారు. రోజుకు 50 నుంచి 60 వేల మీటర్ల ప్రచార సామగ్రిని సిద్ధం చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

ప్రభుత్వం చొరవ చూపాలి...
బీడీలు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు కుటుంబం గడవటం కష్టంగా ఉందని... ఈ పనిని ఏడాది పొడవునా కల్పించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని మహిళలు కోరుతున్నారు.

పలు రాష్ట్రాలకు సరఫరా...
జెండాల తయారీకి ఉపయోగించే ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తికి సిరిసిల్ల కేంద్రంగా మారింది. జిల్లాలో ప్రతిరోజు 30 లక్షల మీటర్ల ముతక రకం పాలిస్టర్ ఉత్పత్తి కాగా... వీటితో జెండాలు, కండువాలు తయారుచేస్తున్నారు. ప్రచార సామగ్రి తయారీ కార్ఖానాలు సుమారు 20 వరకు ఉన్నాయి. ఇక్కడ తయారుచేసిన రాజకీయ పార్టీల జెండాలు కండువాలు గుజరాత్, దిల్లీ, ముంబై, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్​కు సరఫరా చేస్తారు.

ఇవీ చూడండి:ఈటీవీ భారత్ - అరచేతిలో యావత్ జగత్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details