తెలంగాణ

telangana

ETV Bharat / state

విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్​పై అవగాహన

ప్రపంచం రోజురోజుకూ సాంకేతిక పరంగా దూసుకెళ్తోంది. దీనికి అనుగుణంగా నేటి విద్యావ్యవస్థ ఉండాలి. పేద విద్యార్థులకు సాంకేతికపై ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి. దీనిలో భాగంగా సిరిసిల్లలో సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్​పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.

వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలి : వెంకటలక్ష్మి

By

Published : Apr 3, 2019, 10:36 AM IST

విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్​పై అవగాహన సదస్సు
సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంలో తెలంగాణ సాంఘిక, గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్​పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని 31 జిల్లాల నుంచి 97 విద్యాలయాలకు చెందిన 300 మంది విద్యార్థినులు శిక్షణ పొందారు. గత నెల 18న ఈ కార్యక్రమం ప్రారంభమైంది. పదిహేను రోజుల శిక్షణ అనంతరం ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వేసవి శిక్షణ శిబిరాలను విద్యార్థులు పూర్తిస్థాయిలో సద్వినియోగపరుచుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకురాలు వెంకటలక్ష్మి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details