తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏసీబీకి చిక్కిన వేములవాడ సర్వేయర్ - ACB DSP

ప్రజల కోసం విధులు నిర్వహించాల్సిన సర్వేయర్ డబ్బులు డిమాండ్ చేయడం వల్ల బాధితుడు ఏసీబీకి ఫిర్యాదు చేసిన ఘటన వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. రెడ్ హ్యాండెడ్​గా పట్టుబడిన సర్వేయర్​ని అదుపులోకి తీసుకున్నారు.

వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు లంచం అడిగాడు : బాధితుడు

By

Published : Apr 23, 2019, 10:28 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు నిర్వహించింది. సర్వేయర్​గా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ నలుగురు రైతుల నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వేములవాడకు చెందిన చల్ల బాలరాజు, తూర్పాటి శంకర్​కు చెందిన వ్యవసాయ భూమిని, వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తామని కార్యాలయానికి తిప్పించుకోవడం వల్ల బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. ఏసీబీ డీఎస్పీ భద్రయ్య ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి సర్వేయర్ అదుపులోకి తీసుకున్నారు.

రూ.20 వేలు లంచం తీసుకుంటుంటూ ఏసీబీకి చిక్కిన సర్వేయర్

ABOUT THE AUTHOR

...view details