తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యసేవలు బాగునున్నాయని లేఖ.. స్పందించిన హరీశ్ రావు - హైదరాబాద్ తాజా వార్తలు

Harish Rao: సర్కార్ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రసవం కోసం ప్రభుత్వ ఆసుపత్రులకే వెళ్లాలని ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని చెబుతూ మంత్రి హరీశ్ రావుకు లేఖ రాశారు. అతని లేఖపై మంత్రి స్పందించారు. ఈ ఉత్తరం వైద్యుల్లో కొత్త ఉత్సాహన్ని నింపుతుందని హరీశ్​ రావు హర్షం వ్యక్తం చేశారు.

హరీశ్​ రావు
హరీశ్​ రావు

By

Published : Jul 5, 2022, 7:33 PM IST

Harish Rao: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని కాన్పుకోసం సర్కార్ ఆసుపత్రులకే రావాలని ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని చెబుతూ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుకు లేఖ రాశారు. అందుకు హరీశ్ రావు స్పందించి అతనికి ప్రత్యుత్తరం రాశారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. రాజన్న సిరిసిల్లా జిల్లాకు చెందిన పోచయ్య తన కుమార్తె వసంతకు పురిటినొప్పులు రావడంతో ప్రసవం కోసం సిరిసిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.

వైద్యులు వసంతకు సహజ కాన్పు చేయటంతో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అక్కడి వైద్యులు ఎంతో ఆప్యాయంగా చూడటంతో పాటు.. కేసీఆర్ కిట్​ని అందించారని లేఖలో పేర్కొన్నారు. పైసా ఖర్చు లేకుండా అమ్మఒడి వాహనంలో తల్లిబిడ్డను ఇంటికి చేర్చారని తెలిపారు. పేదలకు మంచి జరగాలన్న ఉద్దేశంతోనే ఈ లేఖను మంత్రికి రాసినట్టు పోచయ్య చెప్పారు. ఆయన లేఖకు బదులిచ్చిన మంత్రి హరీశ్ రావు.. తల్లిబిడ్డ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. పోచయ్యకు జరిగిన మేలు అందరికి జరగాలని కోరుతునట్టు పేర్కొన్నారు. పోచయ్య రాసిన ఉత్తరం వైద్యుల్లో కొత్త ఉత్సాహన్ని నింపుతుందని హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details