రాజన్న సిరిసిల్ల జిల్లా మధ్య మానేరు ప్రాజెక్టు నిండటం వల్ల కలెక్టర్ క్రిష్ణ భాస్కర్ ఆరు గేట్లు తెరచి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రాజెక్టు సామర్థ్యం 27.5 టీఎంసీలు కాగా... నీటి నిల్వ ఇప్పటికే 25టీఎంసీలకు చేరుకుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 17,500 క్యూసెక్కులు, స్థానికంగా వరద 11 వేల క్యూసెక్కుల జలాలు నిత్యం మద్య మానేరు ప్రాజెక్టు చేరుతున్నాయి.
నిండుకుండను తలపిస్తోన్న మధ్య మానేరు జలాశయం... 6 గేట్లు ఎత్తివేత - mid manair dam updates
మధ్య మానేరు ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. ఇప్పటికే పూర్తి సామర్థ్యానికి నీటి నిల్వ చేరుకోగా... ప్రాజెక్టు నుంచి 6 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
6 gates open in mid manair dam in siricilla
నీటి నిల్వ పూర్తి స్థాయికి చేరటం వల్ల దిగువ మానేరు ప్రాజెక్టుకు 6 గేట్లతో సుమారు 15 వేల క్యూసెక్కుల జలాలు విడుదల చేశారు. ప్రాజెక్టును ఇంజినీర్ ఇన్ చీఫ్ అనిల్ కుమార్ పర్యవేక్షించారు.