sharmila fire on kcr: పెద్దపల్లి జిల్లా మంథనిలో గోదావరి వరదల్లో మునిగిపోయిన పంట పొలాలను వైతెపా అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిశీలించారు. కేసీఆర్ పెట్ ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే ఈ ముప్పంతా అని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా ఒక ఎకరాకు నీరు ఇచ్చింది లేదన్నారు. సీఎం అనాలోచిత నిర్ణయాల ఇంత నష్టం వాటిల్లిందని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని చెప్పారు. వైఎస్ఆర్ హయాంలో 18 ఏళ్ల క్రితం కట్టిన దేవాదుల నేటికి చెక్కు చెదరకుండ ఉందని పేర్కొన్నారు.
వరదల వల్ల మంథని ప్రాంతంలో 10వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని తెలిపారు. పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో పంట ఎప్పుడు వేసుకోవాలో తెలియక రైతులు అయోమయ స్థితిలో ఉన్నారని చెప్పారు. తన తప్పులు పక్కదారి పట్టించే పనిలో సీఎం ఉన్నారని పేర్కొన్నారు. ఎప్పుడూ వరదలు రాలేదు.. ఇదంతా క్లౌడ్‌బరస్ట్ వల్లే అని ప్రజలను మభ్యపెడుతున్నారు. ప్రాజెక్ట్‌లు కట్టే ముందు వరదలు వస్తే ఎలా అని ముందుగా అంచనా వేయాలి. కేసీఅర్కు పరిపాలన చేత కాదు, ప్రజలను పట్టించుకోని ముఖ్యమంత్రి ఉన్న లేనట్లే అని షర్మిల ఎద్దేవా చేశారు.
"పొలాల్లో ఉన్న పరికరాలు, మోటార్లు పాడైపోయాయి. ఎవరేం కాని హెచ్చరించి లేదు. వరదల వల్ల పొలాల్లో ఇసుకమేటలు వేశాయి. ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడిపారు. ఇన్ని ఎకరాల్లోకి నీరు వచ్చింది. మరి దీనికి బాధ్యత ఎవ్వరూ వహించాలి. కేవలం కేసీఆర్ పెట్ప్రాజెక్టు కాళేశ్వరం వల్లే ఈ ముప్పంతా. అంతకు ముందు వీరికి నీరు రాలేదు కదా. ఇది కేసీఆర్ తప్పిదం కదా. ఇప్పటికి ఏ అధికారి వచ్చి కూడా వీరికి జరిగిన నష్టం గురించి ఆరా తీయలేదు." -వైతెపా అధ్యక్షురాలు షర్మిల