తెలంగాణ

telangana

ETV Bharat / state

కాలుష్యం నుంచి కాపాడే శిరస్త్రాణం - పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షిత ప్రత్యేకత

వెల్డింగ్‌ రేణువులు, పురుగు మందుల తాలూకు రసాయనాలు మొహం వద్దకు రాకుండా సరికొత్త శిరస్త్రాణాన్ని తయారు చేసిందో చిన్నారి.

HELMET
కాలుష్యం నుంచి కాపాడే శిరస్త్రాణం

By

Published : Jan 6, 2020, 3:09 PM IST

వెల్డింగ్‌ పనులతోపాటు పొలాల్లో పురుగు మందులు పిచికారీ చేసే వారి కోసం బహుళ ప్రయోజన శిరస్త్రాణాన్ని తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా రామగిరి మండలానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షిత రూపొందించింది. కంటికి వెల్డింగ్‌ రేణువులు, పురుగు మందుల తాలూకు రసాయనాలు రాకుండా శిరస్త్రాణంలో అమర్చిన కంప్యూటర్‌ ఫ్యాన్లు అడ్డుకుంటాయి.

కాలుష్య వాయువులు ముఖం వద్దకు వచ్చిన వెంటనే ఇదే శిరస్త్రాణంలో ఉన్న స్మోక్‌ సెన్సార్లలోని ఫ్యాన్లు తిరుగుతాయి. 12 వాట్ల బ్యాటరీ సాయంతో శిరస్త్రాణంలోని వ్యవస్థలన్నీ పని చేస్తాయి. 250 గ్రాముల బరువున్న ఈ శిరస్త్రాణం ప్రస్తుతం రైతులు, కార్మికుల అవసరాలను తీరుస్తుంది. త్వరలో ద్విచక్రవాహనదారుల కోసం కూడా అభివృద్ధి చేస్తానని విద్యార్థిని ధీమాగా చెబుతోంది.

కాలుష్యం నుంచి కాపాడే శిరస్త్రాణం

ఇవీ చూడండి: దారుణం... చలిమంటలో వృద్ధురాలి సజీవదహనం

ABOUT THE AUTHOR

...view details