పెద్దపల్లి జిల్లా రామగుండం పట్టణంలో ఇతిహాస ప్రాముఖ్యం కలిగిన గుండాల కొండపై నుంచి జలపాతం జాలువారుతూ కనువిందు చేస్తోంది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొండపై నుంచి నీరు కిందికి పడుతోంది. కొండపై శ్రీరాముడి గుండాల లోయపై నుంచి ప్రవహించే నీరు చుట్టూ పచ్చదనం నీటి మడుగుల సమూహంతో ఈ ప్రాంతం ప్రకృతి శోభను సంతరించుకుంది. శ్రావణమాసంలో ఈ కొండపై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని భక్తులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం.. ప్రకృతి శోభ సంతరించుకుంది. ఇక్కడికి వచ్చే సందర్శకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ప్రకృతి శోభ సంతరించుకున్న జలపాతం - hill
ఇతిహాస ప్రాముఖ్యం కలిగిన రామగుండంలోని గుండాల కొండపై నుంచి జాలువారుతున్న జలపాతం సందర్శకులను కట్టిపడేస్తోంది.
జలపాతం