తెలంగాణ

telangana

ETV Bharat / state

విలీనం ఆపి ఉపాధి కల్పించండి - PEDDAPALLY

ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆందోళన చేస్తున్నారు ఓ గ్రామస్థులు. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో కలిపితే ఉపాధి పనులు కోల్పోతామని నిరసన తెలిపారు.

చేసుకోడానికి పని కల్పించండయ్యా..!

By

Published : Feb 18, 2019, 11:49 PM IST

చేసుకోడానికి పని కల్పించండయ్యా..!
ఉపాధి హామీ పనులు కల్పించాలని డిమాండ్ చేస్తూ పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట కూలీలు ఆందోళన నిర్వహించారు. పూసాల గ్రామాన్ని సుల్తానాబాద్ మున్సిపాలిటీలో విలీనం కావడం వల్ల ఉపాధి హామీ పనులు కోల్పోతున్నామని అధికారులతో మొర పెట్టుకున్నారు.
సుల్తానాబాద్ మున్సిపాలిటీలో విలీనం అవుతున్న పూసాల గ్రామాన్ని రద్దు చేసి ఉపాధి హామీ పనులు కల్పించాలని కోరారు. పోలీసులు నచ్చచెప్పగా ఆందోళన విరమించారు.

ABOUT THE AUTHOR

...view details