తెలంగాణ

telangana

ETV Bharat / state

ఖాకీ చొక్కా పడాల్సిందే..! - MANAIR DAM

ఎంతగానో కష్టపడితేగాని ఈ రోజుల్లో పోలీసు కొలువులు దక్కే పరిస్థితులు లేవు. ఉన్నత విద్యాభ్యాసం చేసి నిరుద్యోగంతో బాధపడుతున్న ఈ యువకులు... ఈసారి ఖాకీ చొక్కా వేయాలనే పట్టుదలతో కసరత్తులు చేస్తున్నారు.

టైర్లతో కసరత్తులు..!

By

Published : Feb 19, 2019, 12:10 AM IST

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌కు చెందిన యువకులు పోలీసు ఉద్యోగం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రాథమిక పరీక్షలో అర్హత సాధించి శరీర దారుఢ్య పరీక్షల కోసం కరీంనగర్‌ డ్యాం ఆవరణలోని ఖాళీ స్థలంలో టైర్లతో కుస్తీ పడుతున్నారు.
టైర్లను నడుముకు కట్టుకొని ఈడ్చుకుంటూ 100 మీటర్ల పరుగును తక్కువ సమయంలో అవలీలలగా ముగిస్తున్నారు. ఎలాగైనా ఉద్యోగం సాధించాలనే కసితో కఠోర కసరత్తులు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details