సుందిళ్ల జలాశయంలో రెండులక్షల చేపపిల్లలు విడుదల - Two lakh fish released in the Sundial reservoir
మంథని మండలంలోని పార్వతి బ్యారేజ్ సుందళ్ల జలాశయంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు రెండు లక్షల చేప పిల్లలను విడుదల చేశారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం పార్వతి బ్యారేజ్ సుందిళ్ల జలాశయంలో మత్య్స శాఖ ఆధ్వర్యంలో పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు రెండు లక్షల చేపపిల్లలను విడుదల చేశారు. మత్య్సశాఖ ఏర్పాటు చేసిన సభావేదిక బ్యానర్లో తమ సామాజిక వర్గానికి చెందిన రాష్ట్ర మంత్రి ఈటెల రాజేందర్ ఫోటో లేకపోవడం శోచనీయమని మత్స్యకారులు వాపోయారు. మరోసారి మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఏ కార్యక్రమానికైనా ఈటల రాజేందర్‌ను ఆహ్వానించాలని... ఆయన హాజరుకాని పక్షంలో ఫోటో పెట్టలాని సూచించారు. ఇలాంటి తప్పిదాలు మరోసారి పునరావృతమైతే సహించబోమని హెచ్చరించారు.