తెలంగాణ

telangana

ETV Bharat / state

తేలియాడే సోలార్‌ పవర్ ప్రాజెక్ట్‌.. నేడు జాతికి అంకితం చేయనున్న ప్రధాని - కరీంనగర్ జిల్లా తాజా వార్తలు

NTPC: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన దేశంలోనే అతి పెద్ద నీటిపై తేలియాడే సోలార్‌ పవర్ ప్రాజెక్ట్‌ను నేడు ప్రధాని మోదీ వర్చువల్‌ పద్దతిలో దేశానికి అంకితం చేయనున్నారు. దీనితో పాటు కేరళలోని కాయంకుళంలో నిర్మించిన 92మెగావాట్ల ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు.

సోలార్‌ పవర్ ప్రాజెక్ట్‌
సోలార్‌ పవర్ ప్రాజెక్ట్‌

By

Published : Jul 29, 2022, 6:59 PM IST

Updated : Jul 30, 2022, 6:23 AM IST

NTPC: పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన రామగుండంలోని 100మెగావాట్ల ప్రాజెక్టుతో పాటు కేరళలోని కాయంకుళం 92మెగావాట్ల ప్రాజెక్టును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో నేడు దేశానికి అంకితం చేయనున్నారు. వర్చువల్​గా జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వీటితోపాటు రాజస్థాన్​లో 735 మెగావాట్ల నోఖ్‌ సోలార్ ప్రాజెక్టు, గుజరాత్‌ కావస్‌, లేహ్‌లోని హైడ్రోజన్ ఫిల్లింగ్ స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు.

రామగుండం ఎన్టీపీసీలో రూ.423కోట్లతో నిర్మించిన 100-మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ పూర్తి అధునాతన సాంకేతికతతో పాటు పర్యావరణ అనుకూలంగా నిర్మించారు. ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్టుకు భూసేకరణ ఇతరత్రా అదనపు ఖర్చులు లేకపోవడంతో శరవేగంగా నిర్మాణ పనిని పూర్తి చేశారు. సోలార్ ప్రాజెక్ట్ రిజర్వాయర్‌లో 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం ఉన్న స్విచ్ యార్డు వరకు 33కేవీ అండర్‌గ్రౌండ్ కేబుల్స్ ద్వారా విద్యుత్‌ను తరలించే ఏర్పాట్లు చేపట్టారు. ఇన్వర్టర్, ట్రాన్స్‌ఫార్మర్, హెచ్‌టి ప్యానెల్ ,పర్యవేక్షక నియంత్రణ మరియు డేటా సేకరణతో సహా అన్ని ఎలక్ట్రికల్ పరికరాలు కూడా ఫ్లోటింగ్ ఫెర్రో సిమెంట్ ప్లాట్‌ఫారమ్‌లపై ఏర్పాటు చేయడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత అని అధికారులు వివరించారు. ఇప్పటికే విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించి దేశంలోనే అతిపెద్ద నీటిపై తేలియాడే సోలార్‌ ప్రాజెక్టుగా పేరొందిందని అధికారులు తెలిపారు.

Last Updated : Jul 30, 2022, 6:23 AM IST

ABOUT THE AUTHOR

...view details