పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆర్టీసీ డిపో ఎదుట టీఎంయూ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సీసీఎస్ లోన్ వెంటనే చెల్లించాలని కోరారు. లేదంటే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
గోదావరిఖనిలో టీఎంయూ రిలే నిరాహార దీక్షలు
ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ మజ్దూర్ యూనియన్ రెండు రోజుల రిలే నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని డిపో ఎదుట టీఎంయూ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు.
దీక్షలో టీఎంయూ నాయకులు