తెలంగాణ

telangana

ETV Bharat / state

తరగతి గదిలో తెరల చాటున విద్యాభ్యాసం - There are no minimum facilities in manthani school students are in trouble.

ప్రభుత్వం ఓ వైపు విద్యారంగాన్ని పటిష్ఠం చేస్తూ... ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నామని చెబుతోంది. పెద్దపల్లి జిల్లా మంథని ఉన్న ఏకైక ఉర్దూ మీడియం పాఠశాలలో మాత్రం అందుకు భిన్నం. ఒక్క గదిలో తెరలు కట్టుకుని విద్యాబోధన చేయాల్సిన దుస్థితి కనిపిస్తోంది.

తరగతి గదిలో తెరల చాటున విద్యాభ్యాసం

By

Published : Aug 26, 2019, 10:06 AM IST

Updated : Aug 26, 2019, 10:21 AM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలోని ఉర్దూ మీడియం పాఠశాలలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తిస్థాయిలో తరగతి గదులు లేకపోవడం వల్ల ఒకే గదిలో విద్యార్థుల మధ్యలో తెరలు కట్టి విద్యాబోధన నిర్వహిస్తున్నారు.

తరగతి గదిలో తెరల చాటున విద్యాభ్యాసం

2 గదులు.. 7 తరగతులు..

ఒకటి నుంచి ఏడో తరగతులకు రెండు గదులు మాత్రమే ఉన్నాయి. దీనికి తోడు 9వ తరగతి వరకు బోధన చేయాలని ఆదేశాలు వచ్చిన గదుల కొరతతో ఆ దిశగా అడుగులు వేయలేకపోతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉన్నప్పటికీ... అధికారులు, పాలకులు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం ఈ పాఠశాలలో ఇరువురు టీచర్లు ఒకేసారి విద్యను బోధించే సమయంలో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు.

కనీస సౌకర్యాలు కరువు

మండల పరిషత్ యుపీఎస్ పాఠశాల అయినప్పటికీ కనీస సౌకర్యాలు కరువయ్యాయి. విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొస్తున్న ఈ క్రమంలో కనీసం ఈ పాఠశాల్లో టాయిలెట్లు, మరుగుదొడ్లు కూడా నిర్మించలేదు. వసతులు లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.

41 మంది విద్యార్థులు.... ఒక టీచర్...

ఈ విద్యా సంవత్సరం 41 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే గత సంవత్సరం ఆరుగురు ఉపాధ్యాయులు ఈ పాఠశాలలో ఉండగా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని వారిని ఇతర పాఠశాలలకు బదిలీ చేశారు. ఈ విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడికి ఇన్​ఛార్జీ బాధ్యతలు అప్పగించి, ఇద్దరు విద్యావాలంటీర్లను నియమించారు. కాగా గత పది రోజుల క్రితం నూతన ఉపాధ్యాయుల నియామకాల్లో భాగంగా ఈ పాఠశాలకు ఓ ఉపాధ్యాయురాలిని నియమించారు. ప్రస్తుతం ఆమెతో పాటు మరో ఇద్దరు విద్యా వాలంటీర్లు విద్యను బోధిస్తున్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని విద్యార్థులు, అక్కడి ఉపాధ్యాయులు వేడుకుంటున్నారు.

ఇవీ చూడండి: బీమా పత్రాలు కాదు... ఇక నుంచి ఎస్సెమ్మెస్​లు...!

Last Updated : Aug 26, 2019, 10:21 AM IST

ABOUT THE AUTHOR

...view details