Allegations against Peddapalli ZPChairmen Putta Madhu: రామగిరి మహిళా ఎంపీపీ దేవక్క దంపతలు చేసిన ఆరోపణలు అవాస్తవమని, వాటిలో నిజం లేదని ఎన్నికలు దగ్గర పడుతుండడంతో కాంగ్రెస్ పార్టీ వీరితో విష ప్రచారం చేయిస్తున్నారని రామగిరి మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీడియా సమావేశంలో పేర్కొన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఎంపీపీ దంపతుల వల్ల మండలంలోని ఎంపీటీసీలు, సర్పంచులు అధికారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
కేసీఆర్, కేటీఆర్ దగ్గరికి వెళ్లే స్థాయి ఎంపీపీ దేవక్క దంపతులకు లేదని, వారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తామని, రామగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శెంకేషి రవీందర్ హెచ్చరించారు. ఎంపీపీ హోదాలో వారు ఈ స్థాయిలో ఉండడానికి పుట్ట మధు కారణమని, ఇవాళ ఆయనపై ఆరోపణలు చేయడం హాస్యాస్పదంగా ఉందని రామగిరి జెడ్పీటీసీ శారద అన్నారు. బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు సృష్టించాలని మీరు చేసిన ఆరోపణలతో ఏకాకిగా మిగిలిపోయారని, అహంకారంతో ఉన్న మిమ్ములను మీ చర్యలను ఖండిస్తున్నామని మండిపడ్డారు.
ఈ సమావేశంలో రామగిరి మండల జడ్పిటిసి, ఎంపీటీసీలు, సర్పంచులు, మండలాధ్యక్షుడు, రైతు కమిటీ చైర్మన్లు, సమన్వయ కమిటీ అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు.
ఎంపీపీ ఆరెల్లి దేవక్కపెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుపై చేసిన ఆరోపణలు అవాస్తవం. కాల్ రికార్డు బయటపెడుతానంటోంది. ఆ రికార్డును మీడియా ముందే బయటపెడితే బాగుంటుంది. అబద్దపు ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ కేటీఆర్ దగ్గరికి వెళ్లే స్థాయి వీరికి లేదు. వారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరిస్తాము.-రవీందర్, రామగిరి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు