'టీబీజీకేఎస్ నాయకుల మధ్య ఘర్షణ' - tbgks
గోదావరిఖనిలో సింగరేణి తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో వర్గవిభేదాలు భగ్గుమన్నాయి. టీబీజీకేఎస్ కార్యాలయంలో సంఘంలోని ఇరువర్గాలు దాడులు చేసుకున్నారు. అనంతరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘంలో వర్గవిభేదాలు బయటపడ్డాయి. గోదావరిఖనిలోని తెలంగాణ బొగ్గగని కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి టీబీజీకేఎస్‌లోని రెండు వర్గాలు దాడులు చేసుకున్నారు. శనివారం జరగబోయే సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ జన్మదిన వేడుకల విషయంలో నాయకుడు నాయిని శంకర్... తమకు సమాచారం ఇవ్వలేదని అదే సంఘంలోని మరోవర్గం నాయకుడు పెంచాల తిరుపతి ఆగ్రహంతో ఊగిపోయారు.అక్కడ ఉన్న ఇతర నాయకులు సర్దిచెప్పిన వినిపించుకోకుండా ఇద్దరు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇరువర్గాలు ఠాణాలో ఫిర్యాదు చేశాయి. ఇవీ చూడండి: ఆ షాట్‌ను ధోనీ మెచ్చుకున్నాడు : పాండ్య