తెలంగాణ

telangana

ETV Bharat / state

పెద్దపల్లిలో ఎస్సారెస్పీ కాలువకు గండి - SRSP Canal Break

పెద్దపల్లి జిల్లాలో ఎస్సారెస్పీ కాలువకు గండి పడింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మట్టి కూరుకుపోయి గండి పడిందని అధికారులు వెల్లడించారు.

SRSP Canal Break at Haripuram Village in Peddapalli district
పెద్దపల్లిలో ఎస్సారెస్పీ కాలువకు గండి

By

Published : Jul 23, 2020, 2:40 PM IST

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం హరిపురం గ్రామ సమీపంలో ఎస్సారెస్పీ- డీ83 కాలువకు గండి పడింది. ఈ కాలువ ద్వారా గత రెండు రోజుల నుంచి నీరు విడుదల అవుతుంది. కాగా గ్రామ సమీపంలో కాలువ సామర్థ్యం తక్కువగా ఉండడం వల్ల నీటి ప్రవాహం ఎక్కువ కావటంతో గండి ఏర్పడినట్లు అధికారులు తెలిపారు.

దీనికితోడు గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం వల్ల మట్టి కూరుకుపోయి గండి ఏర్పడిందని వెల్లడించారు. దీనివల్ల కాలువ నీరంతా సమీప ప్రాంతంలోని పంట పొలాలకు చేరగా... వెంటనే అప్రమత్తమైన రైతులు మట్టి పోసి ఆ నీటిని అదుపు చేశారు. అనంతరం విషయాన్ని ఎస్సారెస్పీ అధికారులకు తెలియజేశారు.

పెద్దపల్లిలో ఎస్సారెస్పీ కాలువకు గండి

ఇదీ చూడండి:తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details