రుక్మిణీ సమేత కృష్ణభగవాణుడికి అభిషేకాలు
పెద్దపల్లి జిల్లా మంథని గోపీజనవల్లభ కృష్ణ మందిరంలో శ్రీ కృష్ణజన్మాష్టమి పురస్కరించుకుని రుక్మిణీ సమేత కృష్ణభగవాణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని గోపిజన వల్లభ కృష్ణ మందిరంలో కృష్ణాష్టమి సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవాచనం పూజలు నిర్వహించారు. రుక్మిణీ సమేత శ్రీ కృష్ణుల వారి మూలవిరాట్టులకు వేదమంత్రోచ్ఛరణల మధ్య పాలు, పెరుగు, తేనె, చక్కెర, నెయ్యితో.. పవిత్రమైన గోదావరి జలాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి వార్లకు పట్టు వస్త్రాలు, స్వర్ణ ,రజిత, ఆభరణాలతో, రకరకాల పుష్ప మాలికలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి 51 రకాల నైవేద్యాలు సమర్పించారు.
- ఇదీ చూడండి : 'కార్తికేయ 2' లో నిఖిల్ సరసన 'ఏజెంట్ స్నేహ'..!