తెలంగాణ

telangana

ETV Bharat / state

యాజమాన్య నిర్లక్ష్యం - GODAVARIKHANI

ప్రైవేట్​ పాఠశాలల యాజమాన్య నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపంగా మారుతోంది. నాణ్యత లేని వసతులతో చిన్నారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు.

యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులకు గాయాలు

By

Published : Mar 1, 2019, 5:37 PM IST

యాజమాన్య నిర్లక్ష్యంతో విద్యార్థులకు గాయాలు
పెద్దపల్లి జిల్లా అంతర్గాం టీటీఎస్ ​ కాలనీలోని శ్రీవాణి ఉన్నత పాఠశాలలో ప్రమాదం తప్పింది. పాఠశాలపై అంతస్తుకు ఎక్కే సమయంలో పరదాగా ఉన్న గోడ కూలి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. యాజమాన్యం స్పందించి చిన్నారులను గోదావరిఖనిలోని సూపర్​ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన మధ్యాహ్నం విరామ ​ సమయంలో జరిగిందని గాయపడ్డ విద్యార్థి తండ్రి వాపోయాడు.

నిర్లక్ష్యమే కారణం:

యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో వసతులను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కోరారు.

ఇవీ చూడండి:బాలుడి మృతి

ABOUT THE AUTHOR

...view details