పెద్దపల్లి జిల్లా మంథనిలో ఓ ఆర్టీసీ కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొనేందుకు ప్రయత్నించగా తోటి కార్మికులు అడ్డుకొని వారించారు. ఆర్టీసీ డిపో ముందు ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడం వల్ల ఉదయం నుంచి ఒక్క బస్సు కూడా బయటికి వెళ్లలేదు. బస్సులన్నీ డిపోలోనే నిలిచిపోయాయి. పోలీసులు కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు 7 బస్సులు మాత్రమే రోడ్డెక్కాయి.
మంథనిలో ఆర్టీసీ కార్మికుల నిరసన - rtc protest in manthani
పెద్దపల్లి జిల్లా మంథనిలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారి తీసింది. ఓ కార్మికుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా... తోటి కార్మికులు అడ్డుకున్నారు.
ఆర్టీసీ కార్మికుల నిరసన