ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి నిరసన చేశారు. భోజన విరామ సమయంలో డిపో గేటు ఎదుట ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ యాజమాన్యం వారం రోజుల క్రితమే ఇరవై డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసు ఇచ్చినప్పటికీ... ప్రభుత్వం స్పందించట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆర్టీసీలో పనిచేసిన డ్రైవర్లకు, కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించి వారికి భరోసా కల్పించాలని కోరారు. తమ సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల ధర్నా - ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల ధర్నా
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ఆర్టీసీ డిపోలో కార్మికులు ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేశారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, లేనిపక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
ఎర్ర బ్యాడ్జీలు ధరించి ఆర్టీసీ కార్మికుల ధర్నా