తెలంగాణ

telangana

ETV Bharat / state

నూతన చట్టాలపై ఆటోడ్రైవర్లకు పోలీసుల అవగాహన - ట్రాఫిక్​ పోలీసుల అవగాహన

నూతన వాహన చట్టం, ట్రాఫిక్​ నియమాలపై రామగుండం ట్రాఫిక్​ పోలీసులు ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ట్రాఫిక్​ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాలు నివారించాలని రామగుండం కమిషనరేట్​ లా అండ్​ ఆర్డర్​ డీసీపీ రవికుమార్​ సూచించారు.

పోలీసులు

By

Published : Aug 26, 2019, 4:42 PM IST

నూతన చట్టాలపై ఆటోడ్రైవర్లకు పోలీసుల అవగాహన

పెద్దపల్లి జిల్లా రామగుండం ట్రాఫిక్ పోలీసులు పెరిగిన జరిమానాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. గోదావరిఖని ట్రాఫిక్ పోలీస్​స్టేషన్ ఆవరణలో లా అండ్​ ఆర్డర్​ డీసీపీ రవికుమార్​ ఆధ్వర్యంలో ఆటోడ్రైవర్లకు నూతన వాహనాల చట్టం, ట్రాఫిక్​ నిబంధనలు వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రోడ్డు ప్రమాదాల నివారణలో ఆటో డ్రైవర్ల పాత్ర కీలకమని డీసీపీ రవికుమార్​ అన్నారు. వాహనం నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నూతన చట్టాల ప్రకారం ఉల్లంఘనలకు పాల్పడితే భారీ జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో రామగుండ ట్రాఫిక్​ సీఐ రమేష్​బాబు, ఆటోడ్రైవర్ల యజమానులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details