పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గ పరిధిలోని 9 మండలాలకు ఉపయోగపడే విధంగా అత్యాధునిక అంబులెన్స్‌లను జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. మంథని పట్టణంలోని తెరాస క్యాంపు కార్యాలయం వద్ద పుట్ట లింగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆక్సిజన్ కలిగి ఉన్న అంబులెన్స్‌లను ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌లు కాటారం, మహాదేవపూర్, మల్హర్రావు, మహాముత్తారం, పలిమేల మండలాల ప్రజలకు సేవలందిస్తుంది.
అత్యాధునిక అంబులెన్స్‌లను ప్రారంభించిన పుట్టమధు - తెలంగాణ న్యూస్ అప్డేట్స్
పెద్దపల్లి జిల్లాలో అత్యాధునిక అంబులెన్స్‌లను జిల్లా పరిషత్ ఛైర్మన్ పుట్టమధు ప్రారంభించారు. ఈ అంబులెన్స్‌ల ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు.
అత్యాధునిక అంబులెన్స్‌లను ప్రారంభించిన పుట్టమధు
కరోనా విజృంభిస్తున్న వేళ అనేక మంది పేద ప్రజలు ఆక్సిజన్ అందక అవస్థలు ఎదుర్కొంటున్నారని పుట్టమధుకర్ పేర్కొన్నారు. ఈ అంబులెన్స్‌ల ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. కరోనా వ్యాధిపట్ల అందరూ ఉండాలని సూచించారు.