వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. నిందితులు కుంట శ్రీను, చిరంజీవి, కుమార్‌ను వరంగల్ జైలు నుంచి మంథని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. వామన్‌రావు హత్య కేసులో వారం రోజుల పాటు ప్రశ్నించి మరిన్ని ఆధారాలు రాబట్టనున్నారు. ఇప్పటికే హత్యకు సంబంధించి ముగ్గురు నిందితులకు సంబంధించి కీలక వివరాలు రాబట్టారు.
వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన వామన్‌రావు, నాగమణి హత్య కేసులో నిందితులను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ కోసం నిందితులను వరంగల్ జైలు నుంచి తీసుకెళ్లారు.
వామన్‌రావు దంపతుల హత్య కేసు నిందితులకు పోలీసు కస్టడీ
హత్యకు కత్తులు సమకూర్చింది బిట్టు శ్రీను అని నిర్ధరించుకున్నారు. హత్యకు కారణాలపైనా దర్యాప్తు చేపట్టారు. హత్య సమయంలో వీడియోను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని నిర్ధరించేందుకు ల్యాబ్‌కు పంపించారు. వారంరోజుల కస్టడీలో మరిన్ని వివరాలు రాబట్టడంతో పాటు హత్య వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు..
ఇదీ చూడండి:"హత్యకు ముందు ఆ తర్వాత"... రిమాండ్ రిపోర్టులో ఏముందంటే..