రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్టమధు అన్నారు. పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం ఆదివారంపేట గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. రైతుల ఇబ్బందులను ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదని ఆయన అన్నారు. రైతులకు విద్యుత్, నీళ్లు, పంటలకు పెట్టుబడులు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తెరాస ప్రభుత్వమేనని.. అందుకే రైతులు సంతోషంగా ఉన్నారని అన్నారు.
మంథని నియోజకవర్గంలో మంథని, రామగిరి, ముత్తారం, కమాన్పూర్ మండలాల్లో 14 రైతు వేదికలు మంజూరయ్యాయని పుట్ట మధు వెల్లడించారు. రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా రైతు సమన్వయ, రైతు వేదికలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతులు పండించిన పంటను కొనుగోలు చేయడానికి అన్ని వసతులు కల్పిస్తుందని పుట్టమధు అన్నారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: పుట్ట మధు
రైతులకు ఎలాంటి కష్టాలు కలగకుండా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పెద్దపల్లి జడ్పీ ఛైర్మన్ పుట్ట మధు అన్నారు. రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని వెల్లడించారు. పెద్దపల్లి జిల్లాలోని ఆదివారంపేట గ్రామంలో రైతు వేదిక నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు.
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యం: పుట్ట మధు