సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా మధ్య నిమజ్జనాలు - సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా మధ్య నిమజ్జనాలు
వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు.
సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా మధ్య నిమజ్జనాలు
పెద్దపల్లి జిల్లాలో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్ తెలిపారు. గోదావరిఖని సమీపంలోని గోదావరి వంతెన వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. సీసీ కెమెరాలు, ప్రత్యేక నిఘా ద్వారా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. మద్యం సేవించి నిమజ్జనంలో పాల్గొనొవద్దని సూచించారు. శోభయాత్రలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు డీసీపీ వెల్లడించారు.
TAGGED:
tg