పెద్దపెల్లి జిల్లా గోదావరి ఖని సంజయ్ గాంధీ నగర్లోని శ్రీ చైతన్య పాఠశాలలో ఫ్యామిలీ పారడైస్ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తల్లిదండ్రులు, గురువులను దైవంగా భావించాలని మేయర్ అనిల్ కుమార్ హితవు పలికారు. అలాగే మంచి నడవడికతో భవిష్యత్తులో ముందుకెళ్లాలని విద్యార్థులకు సూచించారు.
తల్లిదండ్రులను దైవంగా భావించాలి: పెద్దపల్లి మేయర్ - గోదావరి ఖని వార్తలు
తల్లిదండ్రులు, గురువులను దైవంగా భావించాలని పెద్దపల్లి మేయర్ అనిల్ కుమార్ విద్యార్థులకు సూచించారు. గోదావరి ఖనిలోని ఓ పాఠశాల ఫ్యామిలీ పారడైస్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు.
తల్లిదండ్రులను దైవంగా భావించాలి: పెద్దపల్లి మేయర్
తల్లిదండ్రుల పాదాలను చిన్నారులు కడిగి పాదాభివందనం చేశారు. అనంతరం పిల్లలను తల్లిదండ్రులు ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ కుమార స్వామితో పాటు మండల విద్యాధికారి డేనియల్, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :బ్రహ్మ, విష్ణువు తగువు తీర్చిన రోజు!