తెలంగాణ

telangana

ETV Bharat / state

కక్ష్య కట్టి గొడ్డలి పట్టి - RAMAGUNDAM

తరచూ గొడవ పడుతుండేవాడు. ఎన్నిసార్లు మందలించినా... తీరు మార్చుకోలేదు. చేసేదేమిలేక ఊరి నుంచి పంపించేశారు. దాన్ని మనసులో పెట్టుకుని దారుణానికి పాల్పడ్డాడో కిరాతకుడు.

60 ఏళ్ల వృద్ధురాలు మృతి

By

Published : Mar 2, 2019, 6:16 AM IST

Updated : Mar 2, 2019, 8:14 AM IST

పెద్దపల్లి జిల్లా రామగుండంలోని ముబారక్​నగర్​లో దారుణం చోటు చేసుకుంది. సమ్మెట బాలమ్మ అనే 60 ఏళ్ల వృద్ధురాలిని ఇంటి పక్కన ఉండే నంగునూరి నరేష్​ గొడ్డలితో కిరాతకంగా నరికాడు. తల్లి అరుపులు విని కుమారుడు అడ్డుకునే ప్రయత్నం చేయగా... బెదిరించి పరారయ్యాడు నిందితుడు.

పాత కక్ష్యలతోనే...
ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తున్న బాలమ్మ ఇంటి పక్కన ఉన్న యువకుడు నరేష్​ తరచూ ఘర్షణ పడుతుండేవాడు. పోలీసులు మందలించినా నరేష్ ప్రవర్తనలో మార్పులేకపోయేసరికి గ్రామం నుంచి పంపించేయాలని సూచించారు. కొన్నిరోజులుగా నిందితుడు బంధువుల వద్ద ఉంటున్నాడు.

మాటు వేసి...
బాలమ్మ కుటుంబంపై ఉన్న పాత కక్ష్యలతోనే నరేష్​... రెండు రోజులుగా మాటు వేసి... హత్యకు పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
కళ్ల ముందే చనిపోయిన తల్లిని చూసి కుమారులు, కోడళ్లు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

60 ఏళ్ల వృద్ధురాలు మృతి

ఇవీ చూడండి:యాసంగికి ఏర్పాట్లు చేయండి

Last Updated : Mar 2, 2019, 8:14 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details