పెద్దపల్లి జిల్లా నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలోని ఐదో మోటారు వెట్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. దీనిని ప్రభుత్వ సలహాదారు పెంటారెడ్డితో కలిసి ప్రాజెక్టు ఈఎన్‌సీ ప్రారంభించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పక్షం రోజుల్లో మధ్యమానేరు జలాశయానికి కాళేశ్వరం జలాలను తరలిచేందుకు పనులను వేగవంతం చేస్తున్నామని ప్రాజెక్టు ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు చెప్పారు. మేడిగడ్డ నుంచి నందిమేడారం వరకు అన్నీ పంపులు నీటి ఎత్తిపోతలకు సిద్ధమయ్యాయని తెలిపారు. ఈ నెల 5 వరకు ఏడో ప్యాకేజీ, ఎనిమిదో ప్యాకేజీ పంపుహౌస్‌లను పూర్తిచేస్తామని, ఇప్పటికే బిగింపు పూర్తయిన పంపుల ద్వారా వరద కాలువలోకి నీటిని ఎత్తిపోస్తున్నామని పేర్కొన్నారు. వరద కాలువ నుంచి మధ్యమానేరులోకి జలాలు చేరుతున్నాయన్నారు.
ప్రారంభమైన నందిమేడారంలోని ఐదోమోటారు - నందిమేడారం
కాళేశ్వరం ప్రాజెక్టులో నీటి ఎత్తి పోతకు మరో పంపు సిద్ధమైంది. నందిమేడారంలోని ఆరో ప్యాకేజీలో ఐదో మోటారు వెట్‌రన్ విజయవంతంగా నిర్వహించారు. మేడిగడ్డ నుంచి నందిమేడారం వరకు అన్నీ పంపులు సిద్ధమయ్యాయి.
ప్రారంభమైన నందిమేడారంలోని ఐదోమోటారు