ప్రేమికులు కనిపిస్తే చాలు.. - acp
జులాయిలుగా మారిన ఇద్దరు యువకులు ప్రేమికులను లక్ష్యంగా చేసుకున్నారు. పోలీసులమని బెదిరించి ఏం చేశారో తెలుసా..?
పోలీసులమంటూ ప్రేమజంట వద్ద డబ్బులు వసూలు చేసిన ఇద్దరు యువకులు అరెస్టయ్యారు. పెద్దపల్లి జిల్లా గోలివాడ గోదావరి వంతెన సమీపంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని కిషోర్, సాయి కిరణ్‌లు అడ్డగించారు. తాము ఐడీ పార్టీ పోలీసులమని.. డబ్బులు ఇవ్వకపోతే కేసు నమోదు చేస్తామంటూ బెదిరించారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఈ కేడీల ఆట కట్టించారు.డబ్బుల కోసం తప్పుదోవ పట్టారని గోదావరిఖని ఏసీపీ రక్షిత వెల్లడించారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెదిరింపులకు పాల్పడితే 100కు కాల్ చేసి సమాచారం అందించాలన్నారు.