MP Ujjain festival selected Peddapalli drum artists: నాగపూర్ సౌత్ సెంట్రల్ జోన్ కల్చరల్ సెంటర్ ఆధ్వర్యంలో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో జరిగే ఉత్సవాలకు పెద్దపల్లి మండలం రాఘవపూర్ ఒగ్గుడోలు కళాకారులు ఎంపికయ్యారు. ఈనెల 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో వివిధ కళారూపాలను ప్రదర్శించేందుకు కొన్ని రాష్ట్రాలకు ఆహ్వానం అందింది.
తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దపల్లి జిల్లా రాఘవపూర్ గ్రామానికి చెందిన ఒగ్గుడోలు కళాకారులకు ఒగ్గుకళను ప్రదర్శించే అవకాశం దక్కింది. దేశం మొత్తం మీద 15 టీమ్లు ప్రదర్శన ఇవ్వనున్నాయి. అందులో రాఘవపూర్ టీం పాల్గొనడం చాలా గర్వంగా ఉందని... ఒగ్గుడోలు కళాకారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారిలో కుంట సదయ్య, కుంట రాజకుమార్, కుంట సదయ్య, కుంట రమేష్, ఈరు రమేష్, జంగిలి దిలీప్, రమేష్ లతో మరికొంతమంది కళాకారులు ప్రదర్శన ఇవ్వనున్నారు.