కరోనాపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంథని నియోజకవర్గంలోని ప్రజలకు ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా మంథనిలోని ప్రజలందరూ మాస్కులు ధరించి, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, స్వీయ నిర్బంధంలో ఉండాలని ఆయన సూచించారు.
సామాజిక దూరంతోనే మహమ్మారి కట్టడి: ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు - సామాజిక దూరం
మంథని పట్టణంలోని వాడవాడలా తిరుగుతూ ప్రజలకు కరోనా నివారణపై ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అవగాహన కల్పించారు. సామాజిక దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమికొడతాం అంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు.
సామాజిక దూరాన్ని పాటిస్తూ కరోనా వ్యాధిని రూపుమాపాలని కోరారు. పట్టణంలోని వాడవాడలా తిరుగుతూ.. నమస్కారం చేస్తూ స్వీయ జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వ్యాపారస్థులు తమకు సహకరించాలని అధిక ధరలకు నిత్యావసర సామాగ్రిని అమ్మొద్దని చెప్పారు. మంథని సామాజిక వైద్యశాలను సందర్శించి అక్కడి వైద్యసదుపాయాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు తలెత్తినా వెంటనే పోలీసులను సంప్రదించాలని ఎమ్మెల్యే కోరారు.
ఇదీ చూడండి:ఎలాంటి రెడ్ జోన్లు లేవు.. వదంతులు నమ్మొద్దు: ఈటల