తెలంగాణ

telangana

ETV Bharat / state

పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మిషన్ హ్యూమానిటీ సాయం - peddapalli district news

పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మిషన్ హ్యూమానిటీ సాయం
పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మిషన్ హ్యూమానిటీ సాయం

By

Published : Oct 16, 2021, 10:08 PM IST

22:01 October 16

పక్షవాతంతో బాధపడుతున్న వ్యక్తికి మిషన్ హ్యూమానిటీ సాయం

   పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం గూడెం గ్రామంలో పక్షవాతంతో బాధపడుతున్న తిప్పారపు మల్లేష్ కుటుంబానికి మిషన్ హ్యూమానిటీ సంస్థ సాయం అందించింది. 25కిలోల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు నగదును అందజేసింది. మిషన్ హ్యూమానిటీ సంస్థ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని వ్యవస్థాపకుడు పూసాల తిరుపతి తెలిపారు. అవసరం ఉన్న వాళ్లకు సాయం చేయడం కంటే గొప్ప పని ఇంకొకటి ఉండదని చెప్పారు.

 ఆపదలో ఉన్న వారికి సాయం అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు. ఈ సందర్భంగా మిషన్ హ్యూమానిటికి  సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమంలో చిట్ల రామ్, గోపగోని క్రాంతి, మదాసు సాయి, బండి రాజు తదితరులు పాల్గొన్నారు. 

ఇదీ చదవండి:'రామోజీ ఫిలింసిటీ.. హైదరాబాద్​లో ఉండటం గర్వకారణం'

ABOUT THE AUTHOR

...view details