పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం పుట్నూరు శివారులో గూడూరు ప్రధాన రోడ్డు పక్కన ఉన్న మిషన్ భగీరథ పైప్‌లైన్ లీక్ అయింది. పరిసర గ్రామాల రైతులు నీళ్లు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయంటూ పైప్ లైన్ గేటువాల్వ్ వద్ద బోల్టులు తీసేశారని అధికారులు తెలిపారు. లీకేజ్‌తో వచ్చిన తాగునీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారని వెల్లడించారు.
పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్ అయిన భగీరథ నీరు - పెద్దపల్లి జిల్లా వార్తలు
నీరు లేక తమ పొలాలు ఎండిపోతున్నాయని రైతులు మిషన్ భగీరథ పైప్‌లైన్ బోల్టులు పీకేశారు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలో చోటు చేసుకుంది.
పైపు బోల్టులు పీకేసిన రైతులు... లీక్ అయిన భగీరథ నీరు
తాగునీరు బయటకి వస్తుందని సమాచారం అందుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరాను ఆపేశారు. వెంటనే అధికారులు మరమ్మతులు చేశారు. రైతులు ఇటువంటి చర్యలకు పాల్పడవద్దంటూ... సహనంతో ఉండాలంటూ మిషన్ భగీరథ అధికారులు సూచించారు.
ఇదీ చూడండి:దిల్లీ ఆస్పత్రి ఐసీయూలో అగ్నిప్రమాదం