తెలంగాణ

telangana

ETV Bharat / state

మిర్చి రైతులకు లాక్​డౌన్​ కష్టాలు

ప్రకృతి ఒక వైపు.. మద్దతు ధర లేక మరోవైపు.. రైతును నష్టాల ఊబిలో కూడుకుపోతున్నాడు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్మకోవడానికి అన్నదాతలు ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కూలీలు దొరక అతికష్టం మీద మిర్చి కోశారు. కానీ పంటను అమ్మడం గగనంగా మారింది. లాక్ డౌన్ వల్ల రవాణా వ్యవస్థ ఆగిపోవటంతో కర్షకులు మిర్చిని అమ్ముకోలేకపోతున్నారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, మల్హర్​ మండాల్లోని మిర్చి రైతుల కష్టాలపై ప్రత్యేక కథనం..

mirchi formers suffering with lock down in peddapally district
మిర్చి రైతులకు లాక్​డౌన్​ కష్టాలు

By

Published : Apr 10, 2020, 6:05 PM IST

పండించిన పంటను అమ్మకోలేక నానా అవస్థలు పడుతున్నారు మిర్చి రైతులు. పెద్దపల్లి జిల్లాలో 800 ఎకరాల్లో మిర్చి పంట సాగు చేశారు. మార్చి మొదటి వారంలో జిల్లాలో అక్కడక్కడ అకాల వర్షాలు కురవడం వల్ల మిర్చి రైతులు ఆందోళనకు గురయ్యారు. కానీ పెద్ద నష్టం ఏమీ సంభవించలేదు.

క్వింటాకు రూ.15,000

మిర్చి క్వింటాకు రూ.15,000 ఉండడం వల్ల కూలీలకు ఇబ్బంది ఎదురైనా పంట తీశారు. అంత బాగానే ఉన్నా ఇప్పుడు అమ్మడం పెద్ద పనిగా మారింది. లాక్​డౌన్​తో రవాణా ఆగిపోవడం వల్ల పంటను మార్కెట్​కు తీసుకెళ్లలేకపోతున్నారు.

కూలీలకు డబ్బులు ఇవ్వలేక

రవాణా వ్యవస్థ లేకపోవడం వల్ల మిర్చి పంట పొలాల వద్ద నిల్వ ఉండిపోతుంది. కూలీలకు డబ్బులు ఇవ్వలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిర్చి పంట సాగు చేసే సమయంలో ఎరువులు, పురుగుల మందులు ఇచ్చిన వ్యాపారస్తులు డబ్బులు చెల్లించాలని రైతన్నలపై ఒత్తిడి తేవడం వల్ల ఏమి చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.

ఇదీ చూడండి:'రక్తదాతలు ముందుకు వస్తే ఏర్పాట్లు చేస్తాం

ABOUT THE AUTHOR

...view details