పర్యావరణాన్ని సంరక్షించాలన్న ముందు చూపుతోనే హరితహారం కార్యక్రమాన్ని చేపట్టినట్లు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపెల్లి జిల్లా మంథని మండలం రచ్చపెల్లి ఆర్అండ్ఆర్ కాలనీలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో కలిసి మొక్కలు నాటారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటీ 30 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించామని... 67 శాతం రైతాంగానికి కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు.
కేసీఆర్ సంకల్పంతోనే రైతుల బతుకు బంగారమయం: కొప్పుల - minister plantation
పెద్దపెల్లి జిల్లా మంథని మండలం రచ్చపెల్లి ఆర్ అండ్ ఆర్ కాలనీలో జడ్పీ ఛైర్మన్ పుట్ట మధుతో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ మొక్కలు నాటారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కోటీ 30 లక్షలు ఎకరాలకు సాగునీరు అందించామని తెలిపారు.
minister koppula ishwar participated in harithahaaram
జిల్లాలో లక్షా 22 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమస్యలను శాశ్వతంగా దూరం చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలను రూపొందించారన్నారు. 33 శాతం అడవులు పెరిగితే దేశంలోనే రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని మంత్రి కొప్పుల సూచించారు.