మారుతున్న వాతవారణ పరిస్థితుల నేపథ్యంలో పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని.. మొక్కలు నాటడం ఒక యజ్ఞంలాగా సాగాలని రాష్ట్రమంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ఈమేరకు పెద్దపెల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో గ్రీన్ ఇండియాలో భాగంగా ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్, జిల్లా జెడ్పీ ఛైర్మన్ పుట్ట మధుకర్‌లతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
మొక్కలు నాటడాన్ని ఒక యజ్ఞంలా చేపట్టాలి: మంత్రి కొప్పుల
కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడమే శరణ్యమని.. ప్రతి ఒక్కరూ దానిలో భాగస్వామ్యమై ఒక యజ్ఞంలాగా ముందుకు తీసుకువెళ్లాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీలో ఎంపీ వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే కోరుకంటి చందర్లతో కలిసి ఆయన మొక్కలు నాటారు.
తెలంగాణ రాష్ట్రాన్ని పచ్చదనంతో విరాజిల్లేలా సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వెల్లడించారు. రాజ్యసభ సభ్యులు సంతోష్‌కుమార్ తలపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తుందన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటడమే శరణ్యమని సూచించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటి మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి:రైతు వేదిక నిర్మాణాలు గడువులోగా పూర్తవ్వాలి: కలెక్టర్