తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​ - minister koppula eshwar latest news

రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న సీఎం కేసిఆర్​కు రుణపడి ఉండి గూలాబీ జెండా రెపరెపలాడేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.

minister koppula eshwar tour in peddapally district
మంథనిలో పర్యటించిన మంత్రి కొప్పుల ఈశ్వర్​

By

Published : Oct 22, 2020, 10:47 PM IST

పెద్దపల్లి జిల్లా మంథనిలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. ముత్తారం మండలంలోని పారుపల్లి, కేశనపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కేశనపల్లిలోని తెలంగాణ చౌరస్తాలో గులాబీ జెండా ఎగరవేసి, నూతనంగా నిర్మించిన తెలంగాణ తల్లి విగ్రహాన్నిఆవిష్కరించారు.

అనంతరం వివిధ పార్టీలకు చెందిన నాయకులు తెరాసలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ ఛైర్మన్​ పుట్ట మధు, భూపాలపల్లి జడ్పీ ఛైర్మన్​ జక్కు శ్రీహర్షిణి పాల్గొన్నారు.

ఇదీ చూడండి..అంధుల కోసం రూ.5తో పరికరం... వరించిన జేమ్స్​డైసన్‌- 2020 పురస్కారం

ABOUT THE AUTHOR

...view details