తెలంగాణ

telangana

ETV Bharat / state

మంథనిలో మంత్రి పర్యటన... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్​తో పర్యటిస్తూ... మంత్రి కొప్పుల ఈశ్వర్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రైతులకు అండగా ఉంటూ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోందని వెల్లడించారు.

minister-koppula-eshwar-starts-development-programs-in-manthani
మంథనిలో మంత్రి పర్యటన... పలు అభివృద్ధి పనులకు శ్రీకారం

By

Published : Apr 6, 2021, 4:01 PM IST

కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా పథకాలు ప్రవేశపెడితే... మన ప్రభుత్వం రైతులకు అండగా ఉంటూ... రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తోందని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 6,500 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్, జెడ్పీఛైర్మన్ పుట్ట మధుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. రామగిరి మండలంలోని సుందిళ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన రైతు భవనం ప్రారంభించారు. కమ్యూనిటి భవనానికి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామ సభలో పాల్గొని... కేంద్ర స్థాయిలో అవార్డులను దక్కించుకున్న సుందిళ్ల గ్రామ సర్పంచ్ దాసరి లక్ష్మీ-రాజలింగ్​లను మంత్రి సన్మానించారు.

ఇదీ చూడండి:'ఉన్నత విద్యావంతులు వ్యవసాయంపై దృష్టి పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details